Shyam Negi: 1951 నుంచి ఓటేస్తున్న భారత తొలి ఓటరు ఇకలేరు.. మొన్నే ఓటువేసి..ఇవాళ మృతి
Shyam Negi: 1951 నుంచి ఓటేస్తున్న భారత తొలి ఓటరు ఇకలేరు.. మొన్నే ఓటువేసి..ఇవాళ మృతి
Shyam Saran Negi: స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ నేగి ఇక లేరు. 106 ఏళ్ల వయసున్న ఆయన ఇవాళ తెల్లవారుఝామున కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు నవంబరు 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఆయన.. అంతలోనే మరణించారు.
స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. అంతలోనే ఆయన మరణించారు.
2/ 7
ఐతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్య కారణాలతో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఆయన.. నవంబరు 2న ఇంటి నుంచే తొలిసారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారు.
3/ 7
తన ఇంటి ప్రాంగణంలో ఉన్న పోస్టల్ బూత్ వద్దకు రెడ్ కార్పెట్ పరిచారు. ఎన్నికల అధికారులు నేగీని రెడ్ కార్పెట్‌పై బూత్‌కు తీసుకువచ్చారు, అక్కడ అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఓటును ఒక కవరులో సీలు చేసి బ్యాలెట్ బాక్స్‌లో ఉంచారు.
4/ 7
బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని 14వ అసెంబ్లీకి తన ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి. అది జరిగిన రెండు రోజులకే తుది శ్వాస విడిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడమే గొప్ప పండగ అని ఆయన తరచూ చెప్పేవారు.
5/ 7
శ్యామ్ శరణ్ నేగి స్వస్థలం కిన్నౌర్ జిల్లా కల్పా. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. వయో భారం, అనారోగ్య సమస్యలతో కల్పాలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియు నిర్వహించాలని హిమాచల్ సర్కార్ నిర్ణయించింది.
6/ 7
1917లో జన్మించిన నేగి 1951లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు మొదటి ఓటును శ్యామ్ శరణ్ నేగే వేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేస్తూ వచ్చారు.
7/ 7
లోక్‌సభ ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి పదహారు సార్లు ఓటు వేశారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిపి.. ఆయన ఇప్పటి వరకు 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మృతి పట్ల సీఎం జైరాం ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.