దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. RRR Twitter
“RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంది. ఆస్కార్ బరిలో Jr.NTR, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా”..అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై ఇండియా కాక ఇతర దేశాలు ప్రత్యేకంగా తమ ప్రముఖ పత్రికలలో పొగుడుతూ ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. ఇజ్రాయిల్ వంటి శక్తివంతమైన దేశంలో ఏకంగా ఒక ఫుల్ పేజీలో ఈ సినిమా గురించి రాయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
దీంతో ఈసారి ఎలా అయినా ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు రావడం పక్కా అని.. సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ప్రముఖ మ్యాగ్ జైన్ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్), ఉత్తమ దర్శకుడు, ఉత్తమ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆర్ఆర్ఆర్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే తాజాగా అప్ డేట్ చేసిన లిస్ట్ లో ఉత్తమ నటుడి కేటగిరలో రామ్ చరణ్ సైతం పోటీ పడే అవకాశం ఉందని పేర్కొంది.