మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్ల నిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావుతో పాటు పురంధేశ్వరరి కొడుకు హితేష్ చెంచురామ్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. అటు చెంచురామ్ అమెరికన్ పౌరసత్వం కారణంగా దగ్గుబాటి వెంకటేశ్వరావు వైసీపీ తరుపున పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం తరుపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైయ్యారు. ప్రస్తుతం ఈయన వైపీసీకి దూరంగా ఉన్నారు. (Twitter/Photo)
గత ఎన్నికల సమయంలో 30 ఇయర్స్ పృథ్వీ ఎవరు చేయనంత కాస్తంత దూకుడుగా టీడీపీతో పాటు జనసేన పార్టీలోని నాయకులైన చంద్రబాబు, బాలయ్య, అటు పవన్ కళ్యాణ్‌లపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.దీంతో 2019లో అధికారంలోకి రాగానే 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కృషికి గాను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన SVBC చైర్మన్ పదవి కట్టబెట్టారు . (File/Photo)
ఆ పదవిలో ఉండగానే.. ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఒక రకంగా పృథ్వీకి జగన్ ఆయన స్థాయికి మించిన పదవే కట్టబెట్టారు. కానీ పృథ్వీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారనేది అందరు చెప్పుకున్నారు. త్వరలో ఈయన జనసేన పార్టీలో చేరనున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఈయనకు సినీ అవకాశాలు తగ్గాయి. అదే విషయాన్ని ఈయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. (Twitter/Photo)
కొడాలి నాని ఈయన ఎమ్మెల్యే కంటే ముందు నిర్మాతగా ఎన్టీఆర్‌తో ‘సాంబ’, అదుర్స్’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయనకు 2019 ఎన్నికల్లో గెలవగానే మంత్రి పదవి కట్టబెట్టారు. ఒక రకంగా వైసీపీ నుంచి సినీ రంగం తరుపున మొదటి పదవి అందుకుంది కొడాలి నానే అని చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో ఈయన ఎపుడు వెనకాడింది లేదు. (Twitter/Photo)
మంత్రి రోజా కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆమె నెగ్గినా స్వల ఓట్ల తేడాతోనే గెలుపొందారు.వైపీసీ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి ఖాయమనే మాట వినబడింది. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈమెకు తొలిసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. అపుడు రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత రెండో మంత్రి వర్గ విస్తరణలో రోజాకు పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కింది. (Twitter/Photo)
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna murali), అలీలకు(Ali) ఏ రకమైన పదవులు ఇస్తారనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అలీని వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంకు ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా వైపీసీలో కొనసాగుతున్న ప్రముఖ రచయత, దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఏది ఏమైనా ఎంతో కాలంగా వైపీసీకి నమ్మకంగా పనిచేస్తోన్న అలీతో పాటు పోసానికి జగన్ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇచ్చారు. ఒక రకంగా అలీ కంటే పోసానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. (Twitter/Photo)
పోసాని కృష్ణమురళి విషయానికొస్తే.. ఏపీ సీఎం జగన్ కోసం సినీ రంగంలో పెద్దలతో గొడవలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈయనకు అవకాశాలు కూడా తగ్గాయి. అయినా.. ఎక్కడ తగ్గకుండా వైపీసీకి తరుపున తన వాయిస్ వినిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టు జగన్ కూడా ఈయనక ఫిల్మ్ డెవల్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. (Twitter/Photo)
ఆలీ, పోసాని కృష్ణమురళితో పాటు 2019 నుంచి వైసీపీని అట్టిపెట్టుకొని ఉన్న కృష్ణుడు కూడా త్వరలో ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టాలనే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ సర్కారు ఇపుడు వరుసగా సినీ రంగానికి చెందిన వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత ఉన్న పోస్టులును కట్టబెడుతూ... సినీ రంగానికి చెందిన చెందిన ఇతర వ్యక్తులు కూడా తమ పార్టీ వైపు ఆకర్టితులయ్యేలా చేస్తున్నారు.ఇందులో ఎంత వరకు సఫలీకృతులవుతారో చూడాలి. (Twitter/Photo)
అటు సినీ ఇండస్ట్రీలో కీలకంగా వ్యవహరిస్తోన్న నాగార్జునను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఒకవేళ నాగార్జున ఎంపీ పదవికి పోటీ చేయడానికి ఓకే చెబితే అదే స్థానం నుంచి బాలయ్యను పోటీకి దింపాలనే ఆలోచన చేస్తోంది టీడీపీ. కానీ నాగ్ మాత్రం జగన్ కోరికను మన్నిస్తారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
మొత్తంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కమ్ ఏపీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కొక్కరుగా సినీ రంగానికి చెందిని వ్యక్తులకు నామినేటేడ్ పోస్టులు కట్టబెడుతూ..సినీ రంగానికి చెందిన వారికి తగు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంకేతాలు పంపించారు. ఏది ఏమైనా జగన్ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు అర్ధమవుతోంది. (Twitter/Photo)