ఏం చేస్తేనేం నిత్యం వార్తల్లో నిలవాలి. అందరికి మన పేరు సుపరిచితం కావాలి. అందుకోసం ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా పర్వాలేదు...ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన పర్వాలేదు. ఇదే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. (Photo Credit:Instagram)
2/ 12
సొసైటీలో సెలబ్రిటీ హోదా కోసం బుల్లితెర తారలు, రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లు సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్లుగా మారిపోతున్నారు. అందులో ఒకరే అరియానా గ్లోరీ. బిగ్ బాస్ సీజన్-4ఫైనలిస్ట్‌గా అందరికి తెలిసిన సన్నటమ్మాయి. (Photo Credit:Instagram)
3/ 12
బిగ్‌బాస్-సీజన్4 షోలో వచ్చిన పాపులారిటీని అడ్డుపెట్టుకొని ఎంటర్టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది. (Photo Credit:Instagram)
4/ 12
బాలీవుడ్లో శిల్పాశెట్టిలా టాలీవుడ్లో ఇలియానాలా చూడటానికి సన్నగా ఉండే అరియానా కూడా తన ఒంపు, సొంపులు, వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజీ లేడీగా మారిపోయింది. (Photo Credit:Instagram)
5/ 12
బిగ్ బాస్ 4లో ఫైనలిస్టుగా నిలిచి అరియానా గ్లోరీ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చూపిస్తుంది. ముఖ్యంగా రాంగోపాల్‌వర్మతో కాస్త బోల్డ్‌గా ఇంటర్వూ చేసిన తర్వాత ఈ అమ్మడికి మరింత పేరు వచ్చింది. (Photo Credit:Instagram)
6/ 12
క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో చేసిన ఓ హాట్ ఇంటర్వూ అరియానా గ్లోరీ ఫేట్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ ఇంటర్వూలో అమ్మడు చేసిన హంగామా, ఆర్జీవీ అడిగి బోల్డ్ క్వశ్చన్స్‌కి సిగ్గు, ఎగ్గు లేకుండా సమాధానం చెప్పడంతో అందరికి ఈ అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయింది. (Photo Credit:Instagram)
7/ 12
ఇప్పుడైతే స్టార్స్‌తో సమానంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు, ఫోటోలు షేర్ చేస్తోంది అరియానా గ్లోరీ. తాను ఈవెంట్లలో చేస్తున్న డ్యాన్స్ వీడీయోలు, ప్రోగామ్స్‌లో చేస్తున్న వెకిలి పనులకు సంబంధించిన ఫోటోలను చూడమని షేర్ చేస్తోంది. (Photo Credit:Instagram)
8/ 12
ఏది జరిగినా అది మన మంచికే అనుకొని బ్రతకడమే జీవిత పరమార్ధం అంటూ పెద్ద పెద్ద కొటేషన్స్ పెడుతూ నెటిజన్లకు వైరాగ్యంతో కూడిన వేదాంతం వల్లిస్తోంది ఈ జూనియర్ ఇలియానాగా పిలవబడే అరియానా గ్లోరీ. (Photo Credit:Instagram)
9/ 12
బిగ్‌బాస్ షో తర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్సు వస్తుందని ఆశ పడ్డ అరియానా గ్లోరీకి ..అలాంటి అవకాశం రాకపోవడంతో బుల్లితెరపైనే హల్చల్ చేయడం మొదలుపెట్టింది. స్టార్ ఇంటర్వూలు, టీవీ ఆర్టిస్టులతో వీడియోలు చేసి యూట్యూబ్ స్టార్‌గా మారింది.(Photo Credit:Instagram)
10/ 12
అరియానా కెరియర్ పూర్తిగా పట్టాలెక్కక ముందే పెళ్లి చేసుకోబోతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. డ్రెస్సింగ్ సెన్సే కాదు..బోల్డ్‌గా మాట్లాడటం, తనపై ఎలాంటి సెటైర్లు, జోకులు,ట్రోలింగ్ వచ్చినా లైట్ తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంది అరియానా. (Photo Credit:Instagram)
11/ 12
రీసెంట్గా షేర్ చేసిన ఫోటోల్లో అయితే ఈ అమ్మడు గ్లామరే కాదు..కాస్ట్యూమ్ స్టైల్ కూడా మార్చింది. చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపలా ఫోజులిస్తూ ఫోటోలు దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈఫోటోలపై కూడా ఫాలోవర్స్ డిఫరెంట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.(Photo Credit:Instagram)
12/ 12
బిగ్‌బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్, యూ ట్యూబ్ స్టార్ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన అంద, చందాలు, ఒంపు, సొంపులు చూపిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. (Photo:Instagram)