Vaishnavi Chaitanya - Siri - Varsha: ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. నిన్నమొన్నటి వరకు యూ ట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చే అమ్మాయిలే కదా అని చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. కాలం మారిపోయింది. కరోనా కాలం వచ్చిన తర్వాత యూ ట్యూబ్‌లో వచ్చే వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్ అవుతున్నాయి. ఒక్కో సిరీస్ కోట్లలో వ్యూస్ అందుకుంటున్నాయి. దాంతో అందులో నటిస్తున్న వాళ్లకు కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యూ ట్యూబ్ హీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై రప్ఫాడిస్తున్నారు.
అక్కడ్నుంచి వచ్చి ఇక్కడ రచ్చ చేస్తున్నారు. టిక్ టాక్ నుంచి వచ్చిన తెలుగమ్మాయిలు కూడా ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చూపిస్తున్నారు. అలా ఒక్కరో ఇద్దరో కాదు చాలా మంది ఉన్నారు. టిక్ టాక్ భాను నుంచి మొదలు పెడితే.. మౌనికా రెడ్డి, వర్ష వరకు చాలా మంది బ్యూటీస్ కేరాఫ్ యూ ట్యూబ్. అక్కడ్నుంచి వచ్చి ఇప్పుడు బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మరి వాళ్ళెవరో.. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం..