2021లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి (Kriti Shetty).. ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం'తో పాటు.. రామ్ సరసన 'ది వారియర్' చిత్రంలో నటిస్తోంది. (Image Credit : Instagram)
అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేశారు. (Image Credit : Instagram)