దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాతో శ్రీలీల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. (Sreeleela/Instagram)
పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించింది. అయితే శ్రీలీల మాత్రం కేవలం గ్లామర్‌ను మాత్రమే నమ్ముకోలేదని, నటనతోను ఆకట్టుకోవాలనీ అంటోంది. Photo : Instagram
ఇప్పటికే శ్రీలీల చేతిలో 7 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆమెకు ఈరేంజ్‌లో అవకాశాలు రావడానికి మాత్రం ఓ వ్యక్తి కారణమట. ఆయన వల్లే తెలుగులో ఈ రేంజ్లో అవకాశాలు వస్తున్నాయని అంటోంది. శ్రీలీలను లైమ్ లైట్లోకి తీసుకోచ్చింది.. దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిసిందే. దీంతో ఆయన వల్లే తనకు ఈ రేంజ్లో హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయని అంటోంది శ్రీలీల. Photo : Instagram
తాజాగా మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు కుర్ర హీరోలు శ్రీలీల హీరోయిన్గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే ఈ శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. Photo : Instagram
శ్రీలీల 2001 జూలై 14న యునైటైడ్ స్టేట్స్లో జన్మించింది. తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈమె తల్లి ప్రముఖ గైనకాలిస్ట్. ఆ తర్వాత యూఎస్‌లో జన్మించిన ఈమె బెంగుళూరులో చదువుకుంది. ఈమె పెళ్లి సందD సినిమా కంటే ముందు ఈమె కన్నడలో ‘కిస్’, ’భారతే’ అనే సినిమాల్లో నటించింది. అక్కడ నటిస్తూనే తెలుగులో తన లక్‌ను పరీక్షించుకుంది. ( Photo : Instagram)