2022 Year Ender | టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2022 దగ్గర దాదాపు అందరు అగ్ర హీరోలు సందడి చేశారు బడా హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుందో 2022 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. కరోనా థర్డ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. అందులో బాలయ్య, బన్ని తప్ప అందరు హీరోలు ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. ఈ యేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన హీరోలెవరు ? ఎవరు విజయం సాధించారు. బాక్సాఫీస్ దగ్గర జోష్ నింపిన కథానాయికల విషయానికొస్తే..
నాగార్జున - నాగ చైతన్య | 2022 యేడాది మొదట్లో కరోనా థర్డ్ వేవ్ భయపెట్టింది.దీంతో సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ నాగార్జున మాత్రం దైర్యం చేసి ’బంగర్రాజు’ సినిమాను విడుదల చేసి సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు 2022లో మన దేశంలో తొలి హిట్ అందుకున్న హీరోలుగా నాగార్జున, నాగ చైతన్య నిలిచారు. ఇక ఈ యేడాది నాగార్జున బాలీవుడ్లో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ పవర్వాలేదనిపించింది. ‘ది ఘోస్ట్’ మూవీ మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నాగ్.. బెజవాడ ప్రసన్న కుమార్‌తో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.(File/Photo)
పవన్ కళ్యాణ్ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యేడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో పలకరించారు. ఈ చిత్రం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. (File/Photo)
మోహన్ బాబు - మంచు విష్ణు | మంచు మోహన్ బాబు ఈయేడాది సన్ ఆఫ్ ఇండియా మూవీతో పలకరించారు. ఈ సినిమాకు అసలు ఓపెనింగ్స్ రాకుండా..నెగిటివ్ షేర్ తెచ్చుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. జిన్నా మూవీతో పలకరించారు. ఈ సినిమాకు టాక్ బాగున్నా.. ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఈ యేడాది మంచు కుటుంబానికి దారుణమైన ఫలితలను ఇచ్చిందనే చెప్పాలి.
NTR - Ram Charan | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ సినిమాతో వీళ్లిద్దరు ప్యాన్ ఇండియా స్టార్స్‌గా సత్తా చూపెట్టారు. ఇక రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ తర్వాత తన తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’తో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. (Twitter/Photo)