Year Ender 2021 | కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 2020లో డిసెంబర్లో మెల్ల మెల్లగా తెలుగు సినిమాలు విడుదల కావడం ప్రారంభం అయ్యాయి. ఈ కోవలో 2021 సంక్రాంతికి రవితేజ.. క్రాక్ మూవీతో బోణి కొట్టారు. ఆ తర్వాత మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ తర్వాత ‘నాంది’, ‘ఉప్పెన’ జాతి రత్నాలు’ వకీల్ సాబ్’ వరకు అంతా బాగానే ఉంది. ఇంతలో సెకండ్ వేవ్ దేశ ప్రజలనే కాదు.. సినీ ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కరి చేసింది. కరోనా తగ్గిన తర్వాత సినీ ఇండస్ట్రీని కోలుకుంటున్న తరుణంలో కొన్ని వివాదాలు ఇండస్ట్రీని కుదేపేసాయి. అందులో వకీల్ సాబ్ టికెట్ ఇష్యూస్‌తోపాటు.. ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. సమంత, నాగ చైతన్యల విడాకులు.. మా ఎలక్షన్స్ టాలీవుడ్‌ను తీవ్రంగా కుదేపేసింది. (File/Photo)
వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. కరోనా సమయంలో వచ్చిన ఈ చిత్రం అప్పటికి వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 85 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. వరసగా 10 రోజుల పాటు వకీల్ సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా విడుదల సమయంలో ఏపీలో బెనిఫిట్ షోస్ రద్దు చేసింది. మరోవైపు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వీల్లేదంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జార చేసింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై రాజకీయ కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేసిందనే టాక్ ఉంది. ఇప్పటికీ ఈ సమస్య నలుగుతూనే ఉంది.
ఒకవైపు థియేటర్స్‌లో టికెట్ సమస్యలు.. మరోవైపు సినిమాల విడుదలలో బిజీగా ఉన్న సమయంలో సాయి ధరమ్ తేజ్.. సెప్టెంబర్ 10న వినాయక చవితి రోజున బైక్ యాక్సిడెంట్‌కు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్(Sai Dharam Tej)హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని విషయం తేలింది.
రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్ బైక్‌ను అదుపు చేయలేకపోయారని చెప్పారు. తేజ్ ప్రస్తుతం రోడ్డు ప్రమాదం విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. . ఈ కేసుపై త్వరలో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాయి ధరమ్ తేజ్ బయటికి రాలేదు. దాదాపు 45 రోజులు హాస్పిటల్.. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నారు. ఈ యాక్సిడెంట్ పై ఎవరికి వారు తోచినట్టు మాట్లాడటంతో పాటు.. సాయి ధరమ్ కు ప్రమాదం మిగతా హీరోలను అలర్ట్ చేసింది. మొత్తంగా మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులను సాయి తేజ్.. ప్రమాదం పెద్ద కలవరపాటుకు గురి చేసింది.
సాయి ధరమ్ తేజ్ .. యాక్సిడెంట్‌కు గురికావడంలో ఆయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రచార బాధ్యతలు పనవ్ కళ్యాణ్ తీసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తనపై కక్ష్యతో ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ టిక్కెట్ల అమ్మకంలో పారదర్శకత లేదంటున్నారు. అసలు ప్రభుత్వం అమ్మతున్న మద్యం అమ్మాకాల్లో పారదర్శకత ఉందా ఉంటే ఎందుకు అన్ని సార్లు కోర్టులు చుట్టు తిరుగుతున్నారాని ప్రశ్నించారు. అంతేకాదు ప్రభుత్వం పంతానికి పోతే ఏపీలో తన సినిమాలు ఉచితంగా ఆడిస్తాననంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరం అంటూ ఘాటుగానే విమర్శించారు. (Twitter/Photo)
ఈ వ్యాఖ్యలులతో సినిమా పరిశ్రమలో పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని పెద్ద సినిమాల విషయంలో టికెట్ రేట్లను పెంచాలంటూ నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో పవన్ కామెంట్స్ తో ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా లేదా అని టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత తెలుగు నిర్మాతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ప్రకారమే రాబోయే ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్స్ అమ్ముకోవాలని నిబంధన పెట్టడంపై రాజమౌళి అండ్ టీమ్ ఆలోచనలో పడింది. (Twitter/Photo)
ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ నేత సినీ రచయత, దర్శకుడు, నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి .. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదన్నారు. ఏపీ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు పోలికే లేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఎక్కువని పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఇష్యూతో సంబంధం లేని నటిని లాగడంతో పాటు తీవ్ర వివాదం రేగింది.
ఆ తర్వాత పోసాని పవన్ అభిమానులు తన భార్యను అవమానకర రీతిలో మాట్లాడంపై మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు. మొత్తంగా ఈ ఇష్యూలో పోసాని వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి.మొత్తంగా ఏపీలో టికెట్స్ రేట్స్ విషయంలో స్పందించకుండా.. సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్‌కు టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూ తర్వాత మెగా క్యాంప్ హీరోలెవరు పోసానిని అనధికారికంగా నిషేధం విధించిన వార్తలు వచ్చాయి. (File/Photo)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ యేడాది మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. చిరంజీవి మద్ధతుతో ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్‌కు పోటీగా మంచు విష్ణు పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో లోకల్. నాన్ లోకల్‌గా మారిపోయాయి. మొత్తం ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టి అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కారు.
‘మా’ ఎన్నికల్లు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. వాల్డ్ వైడ్‌గా ఉన్న తెలుగు వారు అందరు ఈ ఎన్నికల గురించే మాట్లాడుకునేలా చేసాయి. ముందుగా చిరంజీవి పోటి వద్దని.. ఏకగ్రీవంగా ప్రకాష్ రాజ్‌ను మా అధ్యక్షుడిగా చేద్దాం. ఆ తర్వాత మంచు విష్ణు ప్రెసిడెంట్ చేద్దామన్నారు. కానీ మంచు విష్ణు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎన్నికలకు వెళ్లారు.
‘మా’ జరుగుతున్నప్పటి కంటే కూడా అయిపోయిన తర్వాతే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఓడిపోయిన తర్వాత కామ్‌గా కాంప్రమైజ్ అయిపోతారేమో అనుకుంటే.. ఎవరూ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా గెలిచిన పదవులకు రాజీనామా చేసారు. వాటిని మంచు విష్ణు ఆమోదించారు. మొత్తంగా ఒకటే అని చెప్పుకునే సినీ ఇండస్ట్రీలో రకరకాలు గ్రూపులున్నాయనే విషయం మరోసారి బట్ట బయలైంది.
ఈ యేడాది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన మరో ఇష్యూ నాగ చైతన్య, సమంత విడాకులు. వీళ్లిద్దరు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించి సంచలనం రేపారు. వీళ్లు డైవోర్స్ ప్రకటన కంటే ముందు సమంత.. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇంటి పేరైన అక్కినేని తొలిగించింది. అప్పటి నుంచే నాగ చైతన్య, సమంతకు చెడిందా అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సమంత.. నాగ చైతన్యతో తన స్నేహుతురాలితో కలిసి విహార యాత్రలకు కలిసి వెళ్లడం ఈ విడాకుల మ్యాటర్‌కు మరింత బలం చేకూరింది. ఇక అక్టోబర్ 2న వీరి 4వ వివాహా వార్షికోత్సవం కంటే ముందు విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాగ చైతన్య, సమంత ఇద్దరూ వార్తల్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్లు చేస్తున్న పనులే నెటిజన్స్ నోళ్లలో నానేలా చేస్తున్నాయి. విడాకుల తర్వాత తన పని తాను చేసుకుంటున్నాడు చైతూ. ఓ వైపు ఫ్యామిలీ పార్టీలు.. మరోవైపు తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ సమంత మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో కొంత మంది తనను ట్రోల్ చేయడంపై సమంత కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే కదా.
ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్‌పై చర్చ బాగా జరుగుతుంది. ఒక చోట భారీ రేట్లు ఉండగా.. మరోచోట మాత్రం ఛాయ్ కంటే తక్కువ రేట్లకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు పెంచుకోమ్మని.. మరోవైపు తగ్గించమని ఆదేశాలు జారీ చేసారు. ఏపీలో కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు ఉంది. మరోవైపు తెలంగాణలో 50 నుంచి మొదలై 300 వరకు ధరలున్నాయి. మొత్తంగా ఏపీ టికెట్ రేట్స్ తగ్గించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.(Twitter/Photo)
హీరో నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల సందర్భంగా ... ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో సినిమా థియేటర్ కంటే.. పక్కనే ఉండే కిరాణా షాపు అత్యధిక ఆదాయం వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ల కలెక్షన్ల కంటే కిరాణా షాపు కలెక్షన్లే బాగున్నాయి అన్నారు. టికెట్ ధరలు పెంచినా కొనగలిగే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నాని చెప్పడం పై తీవ్ర దుమారం రేగింది. .Nani Photo: Twitter
నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని... మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడలన్నారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో మాఫియా ఉందని.. దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు.
హీరో నాని కామెంట్స్ పై మరో మంత్రి కన్నబాబు మండిపడ్డారు. కిరాణ షాపులు అంటే ఆయనకు చులకనగా కనపడ్డాయా..? సినిమా టికెట్లు ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించడమా..? రేట్లు పెంచితే గౌరవించినట్లా..? అని కన్నబాబు ప్రశ్నించారు. ఏ వ్యవస్థ కూడా ప్రజల మీద భారం వేయకుండా చూడటం అనేది ప్రభుత్వాల బాధ్యతన్నారు కన్నబాబు. సినిమాకు వెళితే సగటు ప్రేక్షకుడిని ఏవిధంగా పీడిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచుతుంటే ఇంతకాలం ఎవరూ మాట్లాడలేదని.., ఇప్పుడు మేము మాట్లాడుతుంటే.. కక్షసాధింపుగా మాట్లాడుతున్నట్లు ఉందన్ను. నాని మాటలకు అర్థం ఏంటో ఆయనే చెప్పాలి. వాళ్లే మాట్లాడుకుని.. వాళ్లే వివాదాలు తెచ్చుకుంటున్నారని.. థియేటర్లు తనిఖీలు చేస్తే తప్పా? ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని కన్నబాబు గుర్తుచేశారు. (Twitter/Photo)
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీపై వివాదం.. అందులోని ఓ సన్నివేశంపై హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హిందువులకు పవిత్రమైన ఋగ్వేదాన్ని కించ పరుస్తూ కొన్ని డైలాగులున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమాలో అవసరం లేకపోయినా.. ఉద్దేశ పూర్వకంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ జొప్పించారన్నారు. ముఖ్యంగా అపౌరుషేయాలైన ఋగ్వేదం కులం కాళ్లు పట్టుకునే గ్రంథం నాని చెప్పే డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ మూవీ దర్శకుడు ఇతర మత గ్రంథాల్లో ఉన్న వాటిని ఇదే విధంగా హీరోతో డైలాగులు చెప్పించగలరా అని హిందూ సంఘాలు చిత్ర హీరో మరియు దర్శకుడిని ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. (shyam singha roy)
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కంటే ముందు.. ‘ఇపుడు కాక ఇంకెప్పుడు’ సినిమాలో శృంగార సన్నివేశాల సందర్భంగా బ్యాక్ గ్రౌండ్లో ఆది శంకరా చార్యులు వారు రాసిన భజ గోవిందం పాట పెట్టడం తీవ్ర దుమారం రేగింది. సినిమాలో ఆది శంకరా చార్యుల వారి భజ గోవిందం పాట పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో పరమ పవిత్రమైన ఈ గీతాన్ని వాడటంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా 2021లో సినీ ఇండస్ట్రీలో వినోదం కంటే వివాదాలే ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారాయి.