Year Ender 2021 Court Room Drama Movies | సినిమా ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఎంతో ఫేమసో.. ప్రజలకు న్యాయం అందించే లాయర్, జడ్జ్ పాత్రలకు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుంటాయి. మన హీరోలు ఎంతో మంది న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నటించిన ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా అన్యాయానికి గురైన ప్రజల గొంతుకగా మారి వారి తరుపున లాయర్స్‌గా హీరోలు కోర్డులో వాదించే సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. 2021లో కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, సూర్య జై భీమ్ సహా పలు కోర్డు డ్రామా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మొత్తంగా ఈ యేడాది కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలేమిటో ఓ లుక్కేద్దాం.. (Instagram/Photo)
Pawan Kalyan - Vakeel Saab | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేసారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టారు పవన్ కళ్యాణ్. చాలా యేళ్ల తర్వాత హై ఓల్టేజ్ లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ను తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. (Twitter/Photo)
అంతేకాదు టీవీలో కూడా ఈ సినిమా మంచి టీఆర్పీ సాధించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్యాయానికి గురైన మహిళల తరుపున వాదించే వకీల్ సాబ్ సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
జై భీమ్ | సూర్య హీరోగా ‘జై భీమ్’ సినిమాలో లాయర్ చంద్రూ పాత్రలో అదరగొట్టారు. నిజ జీవిత గాథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమాయకులైన గిరిజనులను కొంత మంది స్వార్థపరులైన పోలీసులు అనవసరంగా అక్రమ కేసుల్లో ఇరికించి వాళ్ల జీవితాలను నాశనం చేస్తారు. అమాయకులైన గిరుజనుల తరుపున పైసా తీసుకోకుండా వాదించే లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఈ చిత్రంలో సూర్య తో పాటు మిగిలిన నటీనటులు కూడా అద్భుత నటన కనబరిచారు. ఈ చిత్రంలోని సూర్య నటన అవార్డులు వచ్చే రేంజ్లో ఉందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో దీపావళి సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు IMDB ఇండియన్ మూవీ డేటా బేస్ ఈ సినిమాకు 9.6/10 రికార్డు రేటింగ్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ఏ సినిమాకు ఈ రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. Photo : Twitter
‘తిమ్మరుసు’ | సత్యదేవ్ కంచర తొలిసారి లాయర్ పాత్రలో అదరగొట్టిన సత్యదేవ్. శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించి ఓకే అనిపించింది. ఈ సినిమాలో ఓ మర్డర్ కేసులో చేయని నేరానికి అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి తరుపున వాదించి అతను ఆ తప్ప చేయలేదని వాదించే లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. (Twitter/Photo)
లాయర్ విశ్వనాథ్ | అటు కమెడియన్ ఆలీ.. ‘లాయర్ విశ్వనాథ్’ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాలో యూట్యూబ్‌లో అశ్లీల చిత్రాలతో సమాజం ఎలా నాశనం అయితుందో అంటూ చక్కని పాయింట్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో లాయర్ విశ్వనాథ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైంది. (Twitter/Photo)
నాంది | అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తి తరుపున వాదించే లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. హీరోను ఎలా శిక్ష నుంచి రక్షించారనే కాన్సెప్ట్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాను హిందీలో ఆర్ఆర్ఆర్ హీరో అజయ్ దేవ్‌గణ్‌తో రీమేక్ చేస్తున్నారు. (Twitter/Photo)
నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన మూవీ ‘చెక్’. ఓ ఉగ్రదాడిలో సంబంధం ఉన్న నెపంతో హీరోకు ఉరి శిక్ష విధిస్తారు. చేయని నేరానికి ఉరి కంబం ఎక్కబోయే హీరో ఎలా చెస్ ఛాంపియన్ అవుతాడు. ఈ నేపథ్యంలో అతను నిర్ధోషి అంటూ హీరోయిన్ హీరో తరుపున వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చెస్‌లో గెలిచిన హీరో.. ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడా లేదా అనే కాన్సెస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో అంతగా అలరించలేదనే చెప్పాలి. (Twitter/Photo)