Tollywood Top Movies 2021 : 2021 యేడాది సంక్రాంతికి రవితేజ.. క్రాక్ మూవీతో బోణి కొట్టారు. ఆ తర్వాత మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ తర్వాత ‘నాంది’, ‘ఉప్పెన’ జాతి రత్నాలు’ వంటి చిత్రాలు బాక్సపీస్ దగ్గర రఫ్పాడించాయి. అటు నటించిన ‘వకీల్ సాబ్’ వరకు అంతా బాగానే ఉంది. ఇంతలో సెకండ్ వేవ్‌తో అంతా తారుమారైంది. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ‘అఖండ’ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత ’పుష్ప’.. శ్యామ్ సింగరాయ్ వంటి వరుసగా సినిమాలు థియేటర్స్‌లో క్యూ కట్టాయి. వీటిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే.. ఇందులో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు తీసుకొచ్చిన చిత్రాలు వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. (File/Photo)
1.ఉప్పెన : సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్.. తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ సంచలనం రేపింది. ఈ మూవీ రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ యేడాది నిర్మాతగా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన నెంబర్ వన్ చిత్రం ‘ఉప్పెన’ గా నిలిచింది. (Twitter/Photo)
2..‘జాతి రత్నాలు’ | నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కిన మూవీ ‘జాతి రత్నాలు’. ఈ మూవీ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు వసూళ్లను సాధించింది. రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 28.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Instagram/Photo)
3.‘క్రాక్’ | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన మూవీ ‘క్రాక్’. శృతి హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. రూ. 40 కోట్ల వరకు రాబట్టింది. రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ చేసిన ఈ మూవీ రూ. 22.16 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Krack movie)
4.‘అఖండ’ | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 71 కోట్టకు పైగా వసూళ్లు సాధించింది. ఫుల్ రన్లో ‘అఖండ’ ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ మూవీ రూ. 53కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 18 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీ IMDB రేటింగ్స్‌లో 23 శాతం రేటింగ్‌తో మన దేశంలో ఎక్కువ మందికి నచ్చిన బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. (Twitter/Photo)
5. మాస్టర్: తెలుగు సినిమా కాకపోయినా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన మాస్టర్ సినిమా దాదాపు రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్‌కు తెలుగులో మార్కెట్ భారీగా పెరిగింది అనేది మాస్టర్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా రూ. 8 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ మూవీ రూ. 6 కోట్ల లాభాలను తీసుకొచ్చింది (Twitter/Photo)
6. రెడ్ | రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ‘రెడ్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీలో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసారు. తమిళంలో హిట్టైన ‘తడమ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన వసూళ్లను దక్కించుకోలేకపోయింది. కానీ .. ఇస్మార్ట్ శంకర్’ విజయంతో ఈ సినిమాకు టోటల్ రన్లో రూ. 19.79 కోట్ల వసూళ్లును సాధించింది. రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ మూవీ రూ. 5.79 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
7. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ | అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాతో తొలిసారి అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మొత్తంగా రూ. 23.75 కోట్లు వసూళ్లను సాధించింది. రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 5.64 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.(Photo : Twitter)