#FlashBack2018: వివాహ బంధంతో ఒక్కటైన సెలబ్రిటీలు

2018 ఇయర్‌లో చాలా మంది సెలబ్రిటీలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ హాట్ జోడి రణ్‌వీర్, దీపికా పెళ్లి టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారింది. వీరిద్దరు కొంకణి, సింధీ సంప్రదాయ పద్దతుల్లో రెండు రకాలుగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక, నిక్ జోనస్‌లు కూడా హిందూ, క్రిష్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో ఒకింటి వారయ్యారు. వీళ్లలా 2018లో వివాహా బంధంతో ఒకటైన సెలబ్రిటీలు ఎవరెవరున్నారో మీరు కూడా ఒక లుక్కేండి.