అయితే సమంత యశోద సినిమా షూటింగ్ సమయంలోనే... ట్రాజెడీలు అన్ని చోటు చేసుకున్నాయి. ఆమె తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం. అనారోగ్యం పాలవ్వడం అన్ని జరిగాయి. యశోద సినిమా విడుదలకు ముందే.. సమంత తన అభిమానులకు ఇటీవలే షాకింగ్ వార్త చెప్పింది. తనకు ఉన్న ప్రాణాంతాతకమైన వ్యాధికి సంబంధించిన వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టుచేసింది సమంత. Samantha ruth prabhu (Photo Twitter)
కొందరు వైద్యులు చెబుతున్న సమాచారం మేరకు సమంతకు సోకిన ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆటో ఇమ్మ్యూనిటి డిజాస్టర్ అని తెలుస్తోంది. అయితే మయోసిటిస్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయట. పాలిమయోసిటిస్, డెర్మటో మయోసిటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసిటిస్ ఇలా పలు రకాలుగా ఈ వ్యాధి సోకుతుందని, దీని లక్షణాలు తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది. Samantha (Photo Twitter)
అయితే ఇటీవలే యశోద నటి కల్పిక గణేష్ తాను కూడా సమంతలానే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాననీ తెలిపింది. అయితే తనది ఫస్ట్ స్టేజ్ అనీ, సమంతది మూడో స్టేజ్ అనీ చెప్పుకొచ్చింది. పు 10 ఏళ్ళ పై నుండి ఈమె మయోసిస్ తో బాధపడుతున్నట్లు తెలిపి షాకిచ్చింది. విచిత్రం ఏంటంటే సమంతతో కలిసి కల్పిక 'యశోద' సినిమాలో నటించింది. అంతకు ముందు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.