కోలీవుడ్‌ని శాసిస్తున్న ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్

Yashika Aannand : ఢిల్లీలో పుట్టి... చెన్నైలో సెటిలైన బ్యూటీ యషికా ఆనంద్. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి... 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ అయిన యషికా... 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి... బుల్లితెరపై సందడి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఖాతాలో ఉన్న మరో రెండు సినిమాలు ఇవన్ థాన్ ఉత్తమన్, రాజా భీమా షూటింగ్ దశలో ఉన్నాయి.