ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. బిజినెస్ కూడా 300 కోట్లకు పైగానే జరుగుతుంది. సినిమాకు కరోనా అడ్డు తగులుతుంది కాబట్టి ప్రమోషన్స్ ఆగకూడదని.. కీలక నటుల పుట్టినరోజులకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఇనాయత్ ఖలీల్ అతి పెద్ద సామ్రాజ్యం నారాచిని ఆక్రమించడానికి ఎవరితో చేతులు కలుపుతాడు.. అలాగే తన పుట్టిన రోజును ఇండియాలో ఎక్కడో తెలియని చోటులో జరుపుకుంటున్నాడని ఓ పేపర్ కట్టింగ్ విడుదల చేసారు. ఈ పాత్ర చేసిన బాలయ్య బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ విడుదల చేసారు. మరి సినిమాలో ఇతని పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.