బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగోడి సత్తా ఎల్లలు దాటించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas).. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. రీసెంట్గా వచ్చిన రాధే శ్యామ్ (Radhe Shyam) నిరుత్సాహపరిచినా ఏ మాత్రం వెనకడుగేయకుండా తదుపరి సినిమా షూటింగుల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు.
ఇటీవలే కెజీఎఫ్ 2 సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ రూపొందుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.