తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తొమ్మిదో వారం కూడా చివరి దశలో ఉంది. హౌస్ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. తొమ్మిదో వ్యక్తి ఎలిమినేషన్ కు సమయం కూడా దగ్గర పడింది.
అయితే కొన్ని ప్రైవేట్ సర్వేలు నిర్వహించిన వాటిలో ఎక్కువ వీరిలో విశ్వా, సిరి, కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తేలింది. వీరిలో ఎక్కువగా విశ్వా బయటకు వెళ్తున్నాడే టాక్ వినిపిస్తోంది. హౌస్ లో గేమ్ పరంగా బాగానే ఆడుతున్నా.. బయట ఆడియన్స్ నుంచి ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అతడే ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.