బాపు బొమ్మ ప్రణీత బాటలోనే మరో హీరోయిన్ రహస్యంగా పెళ్లిచేసుకుంది. హీరోయిన్ యామీ గౌతమ్ (Yami Gautam) పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యతో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులతో ఒకటయ్యారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు శుక్రవారం వీరి పెళ్లి జరిగింది. (Twitter/Photo)
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, నటాషా దలాల్ పెళ్లి ఈ యేడాది జనవరి 24న అంగరంగ వైభవంగా ముంబైలోని అలీభాగ్ 5 స్టార్ హోటల్లో జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు కొందరు హీరోలు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు డేవిడ్ ధావన్‌కు సన్నిహితులైన కొందరు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు. వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
Singer Sunitha: టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత జనవరి 9న తేదిన. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఆ తర్వాాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది. వీళ్లిద్దరిది ఒక రకంగా ప్రేమ వివాహాం అనే చెప్పాలి. (Twitter/Photo)