World Wide Highest Share Movies On Day 1 - NBK - Veera Simha Reddy - chiranjeevi - Waltair Veerayya : టాలీవుడ్లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు విడుదలయ్యాయి. దీంతో మరోసారి రికార్డుల వేట టాలీవుడ్లో మొదలైంది. ఈ సినిమాలు మొదటి రోజు కలెక్షన్స్‌లలో ఏ ప్లేస్‌లో ఉన్నాయంటే.. (Twitter/Photo)
RRR 1st Day World Wide Highest Share Movies: ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగులో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాం సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. (RRR movie)
1.ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 74.11 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు.. రూ. 135 కోట్ల షేర్ (రూ. 235 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి అన్ని రికార్డులను వెనక్కి నెట్టి మొదటి ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
4. సైరా నరసింహారెడ్డి: చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ సినిమాపై అంచనాల దృష్ట్యా సైరా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 53.72 కోట్ల షేర్ (రూ. 85 కోట్ల గ్రాస్)వసూళ్లు చేసి ఔరా అనిపించింది.
6.‘సర్కారు వారి పాట’ : సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మొదటి రోజు తెలంగాణ, ఏపీలో రూ. 36.01 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణలో ఈ సినిమా రూ. 12.24 కోట్ల షేర్ రాబట్టి ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో నిలిచింది.ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.21 కోట్ల షేర్ (రూ. 70కోట్ల గ్రాస్) 6వ ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
8. ప్రభాస్ ’రాధే శ్యామ్ భారీ అంచనాలతో విడుదలైనా కూడా ఒక్క రికార్డు కూడా చెరిపేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో కంటే చాలా తక్కువ వసూలు చేసింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 40 కోట్ల షేర్ (రూ. 67 కోట్ల గ్రాస్)వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. (Twitter/Photo)
9.అజ్ఞాతవాసి: పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా నాలుగేళ్ల కిందే తొలి రోజు రూ. 26.40 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 39.30 కోట్ల షేర్ ( రూ. 60.50 కోట్ల గ్రాస్) వసూళు చేసి 9వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
14. భీమ్లా నాయక్: కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. ఇప్పుడు పవన్ సినిమాకు మొదటి రోజు తక్కువ వసూళ్లు రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది ఏపీలో టికెట్ రేట్స్. ఈ కారణంగానే భీమ్లా నాయక్ మొదటి రోజు 26.42 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వాల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే ఈ సినిమా 36.37 కోట్ల (రూ. 56.50 కోట్ల గ్రాస్) వసూళ్ల ను కొల్లగొట్టింది.
17.ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో మొదటి రోజు రూ. 7.90 కోట్లతో టాప్ 10లో ఉంది. ఇద్దరు మెగాహీరోలున్న ఈ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంపై చర్చ మొదలైంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.05 కోట్ల షేర్ (రూ. 50 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
19. వినయ విధేయ రామ: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా.. పైగా బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో వినయ విధేయ రామపై అంచనాలు చాలానే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే తొలిరోజు 25.99 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 31.31 కోట్ల షేర్ (రూ. 42.3 కోట్ల గ్రాస్) వసూళ్లను కొల్లగొట్టింది.