దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది.
ఈ సినిమా టీవీలో ప్రీమియర్‌గా రానుంది. ఈ సినిమా స్టార్ మాలో ఆగస్టు 14వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌గా రానుంది. దీనికి సంబంధించి ఓ ప్రోమోను వదిలారు టీమ్.. దీంతో ఈ సినిమాను మరోసారి టీవీలో కూడా చూడోచ్చని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి అక్కడ ఎంత రేటింగ్‌ను తెచ్చుకుంటుందో.. లేదో చూడాలి, (Photo twitter)
తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన RRR దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపుగా ఉన్న అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. ఇక మరోవైపు ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. (Photo twitter)