బాలనటిగా కెరీర్‌ను స్టార్ చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా, నటిగా తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ విషయానికి వస్తే అలా మొదలైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు 'భీమ్లా నాయక్' మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే.
పవన్ తో నిత్యా మొదటి సారిగా జతకట్టడంతో తన అనుభవాలను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైనా విషయాలను వెల్లడించింది. పవన్ కళ్యాణ్ తో షూటింగ్ చేయడం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చింది. పవన్ తో పనిచేయడం చాలా ఈజీ అంటూ చెప్పింది. పవన్ చాలా సైలెంట్ గా ఉంటాడని.. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు.