Womens Day : సినీ ఇండస్ట్రీ అంటేనే మేల్ డామినేషన్. ఇక్కడ హీరోలను చూసే అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ సినిమాలకు వెళుతుంటారు. కానీ కొంత మంది హీరోయిన్స్ కూడా హీరోలతో సమానమైన క్రేజీ సంపాదించుకున్నారు. అందులో కొంత మంది హీరోయిన్స్ తనయులు కూడా హీరోల కొడుకుల మాదిరే సినీ ఇండస్ట్రీలో కథానాయికలుగా సత్తా చాటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నర్గీస్ దత్ తనయుడు సంజయ్ దత్తో పాటు అభిషేక్ బచ్చన్, అఖిల్ సహా పలువురు హీరోలున్నారు. (File/Photos)
నర్గీస్ దత్ - సంజయ్ దత్ | సంజయ్ దత్.. ఒకప్పటి సునీల్ దత్, నర్గీస్ దత్ ముద్దుల తనయుడు. ఈయన హీరో కమ్ హీరోయిన్ తనయుడు. ఒక కథానాయిక కుమారుడు హీరో అవ్వడం మొదలైంది ఈయనతోనే. ఈయన బాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగారు. లాస్ట్ ఇయర్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’తో మరోసారి తన విలనిజాన్ని ప్రదర్శించారు. (File/Photo)