కొంత మంది కథానాయికలు తాము నటించడమే కాదు.. డైరెక్టర్ పాత్ర కూడా పోషించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి మాట్లాడాల్సి వస్తే.. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. వారితో భానుమతి, సావిత్రి, విజయ నిర్మల వంటి వారున్నారు. (file/Photo)
ఇప్పటి జనరేషన్లో రేవతి కూడా దర్శకురాలిగా సత్తా చాటింది. ముందుగా ఈ మాట వినగానే చాలా మందికి ఒక మంచి నటి గుర్తుకు వస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవతి.. ఆ తరువాత దర్శకురాలిగా మారింది. ‘ఫిర్ మిలేంగే’, ‘కేరళ కేఫ్’, ‘ముంబై కటింగ్’ లాంటి సినిమాలకు డైరెక్షన్ చేసింది. (Twitter/Photo)
తాజాగా ఈ జాబితాలో సోనమ్ కపూర్, దియా మీర్జా లాంటి హీరోయిన్స్ కూడా సినిమాలు చేయాడానికి రెడీ చేసుకుంటున్నారు. మొత్తానికి ఆన్ స్క్రీన్లో నటించడమే కాదు.. బిహైండ్ ది స్క్రీన్లో దర్శకులుగా వీళ్లు సత్తా చాటారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోయిన్స్ మెగాఫోన్ పట్టుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (File/Photos)