' అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా, నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. ప్రస్తుతం సదా ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. ఇక అది అలా ఉంటే సదా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అయితే ఆమె అందానికి ఫిదా అయిన ఓ నెటిజన్.. సదా నన్ను పెళ్లి చేసుకోవా.. అంటూ స్వీట్‌గా ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram
Sadha: సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టింది. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి. Photo : Instagram
సదా కెరీర్లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగులో ఈ భామ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఆ మధ్య ఈ భామ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. Photo : Instagram
Sadha : ఇక సదా మొదటి హీరో నితిన్ సినిమాల విషయాినకి వస్తే.. యువ హీరో నితిన్ (Nithiin) గతేడాది మూడు సినిమాలతో పలకరించారు. ‘రంగ్ దే’, చెక్’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘మాస్ట్రో’ (Maestro)చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే నితిన్ వరుసగా సినిమాలను చేస్తున్నారు. . Photo : Instagram
అందులో భాగంగా ఆయన హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదల ఎప్పుడు కానుందో టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఆగష్టు 12, 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. Photo : Instagram
అయితే అదే రోజున నటిస్తున్న యశోద, అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ కూడా విడుదలకానున్నాయి. అయితే ఈ సినిమాను మొదట జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేథరిన్ ట్రెస్సా, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Krithi Shetty) నితిన్ (Nithiin) సరసన హీరోయిన్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.. Photo : Instagram
ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో పాటు నితిన్, వక్కంతం వంశీ (Vakkantham vamsi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.. Photo : Instagram