ఈ షో వల్లే ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ఈ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు గతంలో ఏ టాక్ షో మెప్పించని స్థాయిలో ఈ షో మెప్పించింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన సామ్ జామ్ సక్సెస్ కాకపోయినా ఈ షో మాత్రం సక్సెస్ అయింది. దీంతో బాలయ్య అన్స్టాపబుల్ సీజన్2 కు కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అయితే బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్1 కు హాజరు కాని అతిథులు అన్ స్టాపబుల్ సీజన్2 కు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వెంకటేష్, నాగార్జున కూడా ఈ షోలో సందడి చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్2 కు పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఈ షోకు ఎన్టీఆర్ వస్తే.. బాలయ్య ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య రవితేజ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్ కాగా అన్ స్టాపబుల్ సీజన్1 ద్వారా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకే వేదికపైకలిసి కనిపించి రూమర్లకు చెక్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.ఒకవేళ ఎన్టీఆర్ కనుక ఈ షోకు వస్తే.. అటు బాలయ్య ఫ్యాన్స్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆనందానికి అవధులే ఉండవనడంలో ఎలాంటి డౌట్ లేదు.