Anushka Shetty: గత 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి.
గత 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి.
2/ 11
సూపర్ సినిమా నుంచి నిన్నటి సైరా వరకు ఎన్నో సంచలన సినిమాలు చేసింది అనుష్క. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలకు చేరువగా నటించింది ఈ ముద్దుగుమ్మ.
3/ 11
ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాతో రానుంది అనుష్క. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. థియేటర్స్ ఓపెన్ కాగానే సినిమా విడుదల కానుంది.
4/ 11
ఇదిలా ఉంటే అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి ఎన్నో సినిమాల్లో మరిచిపోలేని పాత్రలు చేసింది అనుష్క శెట్టి.
5/ 11
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది జేజమ్మ.
6/ 11
హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.
7/ 11
ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని అనుష్క నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది.
8/ 11
బాహుబలి తర్వాత ఈమె అదే పని చేస్తుంది. ఈ మూడేళ్లలో ఎప్పుడో ఒప్పుకున్న భాగమతిని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక్క నిశ్శబ్ధం మాత్రమే ఒప్పుకుంది.
9/ 11
గతేడాది చిరంజీవి నటించిన సైరాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో మెరిసింది.
10/ 11
తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు వచ్చినపుడు చూద్దాంలే.. ఇప్పటికైతే ఇక చాలు అని అనుష్క భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య జేజమ్మ నుంచి అస్సలు అనౌన్స్మెంట్స్ కూడా రావడం లేదు.
11/ 11
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అనుష్క అసలు ఫ్యూచర్లో అయినా సినిమాలు చేస్తుందా లేదా అనేది మాత్రం అనుమానంగానే మారింది. ఎలాగూ కరోనాతో మరో ఆర్నెళ్లు అయితే షూటింగ్స్ జరగవు.. ఆ తర్వాత జేజమ్మ మనసు ఎలా మారనుందో..?