నయనతార పెళ్లెప్పుడు.. ప్రియుడు సిద్ధంగానే ఉన్నాడు.. సహజీవనం చేస్తుంది.. 5 ఏళ్లుగా ఒకరికొకరు బాగా తెలుసు. అయినా కూడా ఎందుకు నయనతార పెళ్లి పీటలెక్కడం లేదు.. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఇవే అనుమానాలు చాలా రోజులుగా ఉన్నాయి. ప్రతీసారి పెళ్లి వరకు వచ్చి నయనతార మళ్లీ వెనక్కి వెళ్లడం.. ప్రేమలో విఫలమైన ప్రతీసారి కెరీర్లో పైకి ఎదగడం ఈమెకు అలవాటుగా మారింది.
అయితే నయనతార పెళ్లికి దూరంగా ఉండటానికి మరో కారణం కూడా ఉందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెకు పెళ్లి గండం ఉందని.. అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉందని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా అనుకోవచ్చు.. కానీ నయన్ జీవితంలో జరిగిన విధానం చూసిన తర్వాత నమ్మక తప్పడం లేదు.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది నయన. వీళ్లిద్దరూ ఐదేళ్లుగా కలిసే ఉంటున్నారు. పెళ్లి మాత్రమే కాలేదంతే. అయితే విఘ్నేష్ శివన్నే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నా.. ప్రేమబంధంతోనే సరిపెడుతుంది కానీ పెళ్లి బంధంలోకి మాత్రం అడుగు పెట్టరాదని ఫిక్సైపోయింది నయన్.
అందుకే విఘ్నేష్ గురించి ఎప్పుడు అడిగినా కూడా ఫ్రెండ్ కంటే ఎక్కువ.. ఆత్మీయుడు అంటుందే కానీ అంతకుమించి మాట్లాడటం లేదు. దీనికి అంతటికి కారణం ఆమె జాతకం అని ప్రచారం జరుగుతుంది. పెళ్లి అనేది ఆమెకు అస్సలు అచ్చిరాలేదని.. అక్కడి వరకు వస్తే విడిపోతుందనే భయం ఉండటంతో ఆమె పెళ్లికి దూరంగా.. సహజీవనానికి దగ్గరగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు.. జాతకం ప్రకారం ఈమె రాజకీయాల్లోకి కూడా వస్తుందని.. కచ్చితంగా ఆ ఆసక్తి కూడా చూపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మ ఉన్నపుడే ఆమె పార్టీలోకి రావాలని చూసింది నయన. కానీ ఆ తర్వాత కుదర్లేదు. అయితే ఇప్పుడు ఈమెకు ఉన్న ఇమేజ్‌కు కచ్చితంగా ఏదో ఓ రోజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మరి చూడాలిక.. పెళ్లికి దూరంగా ఉండి అమ్మ మాదిరే ఈమె కూడా ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్తుందేమో..?