Ram Charan: రామ్ చరణ్ అయ్యప్ప మాల వెనుక ఉన్న కథ ఇన్నాళ్లకు బయటకొచ్చింది.. ఏడాదికి రెండుసార్లు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆచార్య ప్రిరిలీజ్ వేడుక కూడా చరణ్ అయ్యప్ప మాలలోనే వచ్చాడు. దీంతో చరణ్ ప్రతీ ఏటా అయ్యప్ప మాల ఎందుకు ధరిస్తాడు.దీక్ష ఎందుకు చేపడతాడు ? ఇప్పుడు ఇవే చర్చనీయాంశంగా మారాయి.
సినిమా విజయం తర్వాత దీక్షకు దిగారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా చరణ్ అయ్యప్ప మాల వేసుకున్నారు. రామ్ చరణ్‌కు దేవుడిపై భక్తి ఎక్కువే. అందుకే ప్రతీ ఏటా కూడా తప్పకుండా అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటాడు.
2/ 11
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. రామ్ చరణ్ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు రామ్ చరణ్. అయితే చరణ్ ఏడాదిలో రెండు సార్లు అయ్యప్ప మాల వేసుకుంటాడన్న విషయం చాలా మందికి తెలియదు.
3/ 11
తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్ అయ్యప్ప దీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏడాదిలో రెండు సార్లు అయ్యప్ప మాల వేసుకుంటానని.. మాలలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు చరణ్.
4/ 11
సాధారణంగా తన పుట్టిన రోజుతో పాటు ఈ ఏడాది చివర్లో అయ్యప్ప మాల వేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా మారిపోయింది అంటున్నాడు మెగా పవర్ స్టార్. అయితే ఈసారి ట్రిపుల్ ఆర్ విడుదల సందర్భంగా మాల ముందుగా వేసుకోలేకపోయానని.. అందుకే విడుదల తర్వాత వేసుకున్నానని చరణ్ తెలిపాడు.
5/ 11
ఈ ఏడాది చివర్లో దసరా తర్వాత కూడా అయ్యప్ప మాల వేసుకుంటాను అని చెప్పాడు చరణ్. తాను ఎంత బిజీగా ఉన్నా కూడా మాలధారణ విషయంలో మాత్రం చరణ్ కొన్నేళ్లుగా అదే నియమాలు పాటిస్తూ వస్తున్నాడు.
6/ 11
ఆర్ఆర్ఆర్ రిలీజ్ సక్సెస్ మీట్లు అవ్వగానే, చరణ్ ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష చేపట్టాడు, ప్రస్తుతం చరణ్ మాలలోనే ఉన్నాడు, ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా చరణ్ అయ్యప్ప మాలలోనే కనిపించాడు.
7/ 11
చరణ్‌తో పాటు మెగాస్టార్ కూడా అప్పుడప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు.మనం చిరును కూడా ఈ మధ్య కాలంలో అయ్యప్ప దీక్షలు చూశాం, దీంతో తల్లిదండ్రులిద్దరికీ కూడ దేవుడంటే ఎంతో భక్తి అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
8/ 11
రామ్ చరణ్‌ను చూసి ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలు కూడా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా జూనియర్ కూడా ఈ మధ్య కాలంలో హనుమాన్ దీక్షలో కనిపించాడు.
9/ 11
అయితే అయ్యప్ప మాల వేసుకొనే రామ్ చరణ్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ కూడా హనుమాన్ దీక్షకు దిగాడని అటు మెగా ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. దీనిపై చరణ్ కూడా స్పందించాడు.
10/ 11
రామ్‌చరణ్‌ను చూసిన తర్వాతే ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై చరణ్ వివరణ ఇస్తూ.. అలాంటిదేం లేదు.. చాలా సంవత్సరాలుగా ఎన్టీఆర్ కూడా వేయాలి అనుకుంటున్నారు.. ఇప్పటికి కుదిరింది అని చెప్పాడు.
11/ 11
తెరపై హీరోయిజం చూపించే తమ అభిమాన హీరోలు తెర వెనుక ఇలా భక్తి భావం కూడా కలిగి ఉండటంపట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.