ఆ హెయిర్ స్టైల్ తో ఉన్న లుక్స్ లీక్ అవ్వకుండా ప్రభాస్ తన జుట్టుకు ఈ క్యాప్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన లుక్స్ ముందే బయటకు వచ్చేవి. సినిమా యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం కంటే ముందే ప్రభాస్ లుక్ బయటకు వచ్చేసేది. అందుకే తన లుక్స్ బయటపడకుండా ప్రభాస్ ఈ విధంగా క్యాప్ మెంటైన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.