బిగ్ బాస్ 5 తెలుగు ముగిసిన మూడు నెలల్లోపే ఓటిటి అంటూ మరో కొత్త వర్షన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది బిగ్ బాస్. దానికి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎంత అభిమానులున్నా కూడా మరీ 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే కష్టమే కదా..? ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటిటి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సీజన్ మొదలైనా బయట మాత్రం పెద్దగా ప్రభావం కనిపించడం లేదు.
ఇంకా చెప్పాలంటే అసలు సీజన్ మొదలైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి మెయిన్ బిగ్ బాస్ వస్తున్నపుడు రేటింగ్స్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ చర్చ బాగా జరుగుతుంది. ఎవరు ఉంటున్నారు.. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.. నామినేసన్స్లో ఎవరున్నారు అంటూ చాలా రకాల చర్చలు జరుగుతుంటాయి. ఓటింగ్ మీటింగ్ రేటింగ్ అంటూ ఏదేదో జరుగుతుంటుంది. కానీ ఓటిటి కోసం అంత హంగామా కనిపించడం లేదు.
అంతెందుకు నామినేషన్స్‌లో ఎవరున్నారనే సంగతి కూడా చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో..? ముందు అనుకున్నంతగా ఈ షో అయితే జనాల్లోకి వెళ్లలేదనేది కాదనేలేని నిజం. కాకపోతే కొందరు ఇంకా బిగ్ బాస్ ఓటిటి వర్షన్ చూస్తున్నారు. ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో 8 మంది పాత వాళ్లున్నారు.. మిగిలిన వాళ్లు కొత్త కంటెస్టెంట్లు.
ఇదిలా ఉంటే వీకెండ్ రావడంతో ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఎంతమంది నామినేట్ అయ్యారు.. ఎంతమంది సేఫ్ జోన్లో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఇప్పటి వరకు ఓటింగ్ పరంగా అరియానా ముందుంది. ఈమెకు 29 శాతం వరకూ ఓటింగ్ జరిగింది. ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్ కావడంతో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పైగా ముక్కుసూటి తనం అరియానాకు స్పెషల్.
అరియానా తర్వాత ఆర్జే చైతూ ఉన్నాడు. ఈయనకు కూడా 14 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కుర్రాడు సేఫ్ అవ్వడం ఖాయం. మూడో స్థానంలో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. ఈయన కూడా సేఫ్‌గానే ఉన్నాడు. ఆయన సీరియస్‌గానే ఉన్నా.. బయట మాత్రం కామెడీగా అనిపిస్తుంది ప్రేక్షకులకు. ట్రోలర్స్ కూడా పండగ చేసుకుంటున్నారు నటరాజ్ మాస్టర్‌ను చూసి. అందుకే ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉండొచ్చు ఈయన.
హమీదాకు బాగానే ఓట్లు పడుతున్నాయి. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు. అందులో ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, సరయు. బిగ్ బాస్ 5 తెలుగులో సరయు ఏం ఆడుతుందో.. ఎలా ఆడుతుందో తెలియకుండానే మొదటి వారమే బయటికి వచ్చేసింది కాబట్టి ఈ సారి మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు ఆడియన్స్. దాంతో కచ్చితంగా ఈమె సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది.