Box Office War | ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాల హడావుడి ఉన్నా.. ఆచార్య తర్వాత ఒక వారం గ్యాప్ దొరకడం.. నెక్ట్స్ వీక్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ఉండనే ఉంది. ఈ గ్యాప్లోనే చిన్న సినిమాల నిర్మాతలు తమ మూవీలను విడుదల చేస్తున్నారు. ఈ కోవలో ఈ వారం మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జున కళ్యాణంతో పాటు భళా తందనాన’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. (Twitter/Photo)
అశోకవనంలో అర్జున కళ్యాణం | విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. విద్యాసాగర్ చింతా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కేజీఎఫ్, ఆచార్య సినిమాలకు భయపడి ఈ సినిమా ఈ రోజు విడుదల (మే 6) చేస్తున్నారు. . ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో విశ్వక్సేన్ చేసిన ఫ్రాంక్ వీడియో ఇపుడు సంచలనంగా మారింది. (Twitter/Photo)