నటుడు నరేశ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై.. గతంలో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని అప్పులు చేసిన రమ్య.. పెద్ద మొత్తంలో డబ్బులు ఎగ్గొట్టినట్లు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రమ్య తాజాగా పవిత్ర లోకేష్ వ్యవహారంతో తెరపైకి రావడంతో.. మరోసారి ఆమె హాట్ టాపిక్‌గా మారారు.