కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి.. ప్రియుడు హిందీ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకున్నారు జెనీలియా. ఇక అది అలా ఉంటే ఆమె కంటే ఆమె భర్త రితేష్ చాలా పెద్దవాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్య దాదాపు 9 సంవత్సరాల తేడా ఉందట. అయినా కూడా చక్కని అండర్ స్టాండింగ్‌తో జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ జంట. వీరికి ఇద్దరు సంతానం. Photo : Instagram/geneliad
ఇక జెనీలియా విషయానికి వస్తే.. సాంబ, ఆరెంజ్, సై, సుభాష్ చంద్రబోస్ లాంటి చాలా సినిమాలు చేసింది ఈ భామ. ఒకప్పుడు వరస సినిమాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకోలేదు. కొడుకు పుట్టిన తర్వాత ఇంటికే పరిమితం అయిపోయింది జెనిలియా.Photo : Instagram/geneliad
ఇప్పుడు మళ్లీ ఈ భామకు సినిమాలపై ధ్యాస మళ్లినట్లుంది. అందుకే త్వరలోనే తాను సినిమాలు చేయబోతున్నట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భర్త రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా ఉన్న జెనిలియా త్వరలోనే నటిగా మళ్లీ తెరపై కనిపించబోతుంది. పెళ్లైన ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ ఈమెను హీరోయిన్గా ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగని జెన్నీ అక్క, వదిన పాత్రల్లో నటిస్తే అభిమానులు తట్టుకోలేరు. మంచి కథ వస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఒక్కటే ఇప్పుడు జెనిలియా ముందున్న ఆప్షన్. Photo : Instagram/geneliad
మంచి కథ వస్తే నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెబుతుంది. మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత అయినా కూడా మళ్లీ సినిమాల వైపు వచ్చేస్తుంది హాసిని. 2012లో రానా హీరోగా వచ్చిన నా యిష్టం తర్వాత మళ్లీ కనిపించలేదు జెనిలియా. ఇన్నాళ్ళకు సినిమాల వైపు వస్తుంది. అంటే జెనిలియా అల్లరిని మళ్లీ తెరపై చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట. Photo : Instagram/geneliad