ఎందుకంటే మరో దిగ్గజ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. సినిమాలు కూడా పక్కనబెట్టి ఏడాదిగా రాజకీయాలతోనే బిజీ అయ్యారు. అయితే చివరికి ఆయనకు శూన్యమే మిగిల్చారు తమిళ ఓటర్లు. కనీసం కోయంబత్తూరులో నిలబడిన ఈయన కూడా గెలవలేకపోయారు. కనీసం ఒక్కసీట్ కూడా గెలవకుండా రిక్తహస్తమే ఎదురైంది.
కమల్ హాసన్‌కు ఎదురైన పరాభవం చూసిన తర్వాత రజినీకాంత్ నిర్ణయం సరైందే అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఉన్నఫలంగా సినిమా ఇమేజ్ అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను చూసినపుడే అందరికీ అర్థమైంది.
మరోవైపు ఈ ఫలితాలను కూడా ఈయన ముందే ఊహించారనేది స్పష్టమవుతుంది. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. అన్నాడిఎంకే పార్టీకి మాత్రం రజినీ సపోర్ట్ చేసారనే ప్రచారం తమిళనాట జరుగుతుంది. ఆ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు రావడానికి రజినీ ఇమేజ్ కూడా ఉపయోగపడిందని తెలుస్తుంది. ఏదేమైనా రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకున్నపుడు అభిమానులు అప్పుడు ఫీల్ అయినా.. ఇప్పుడు మాత్రం ఆయన నిర్ణయం సరైందే అనుకుంటారు.