తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాప్ యాంకర్స్ ఉన్నారు. అందులో సుమ, అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ అందరికంటే ముందుంటారు. ట్రెడిషనల్ యాంకరింగ్‌తో సుమ అందరిని ఆకట్టుకుంటే.. మాస్ గ్లామర్ షోతో అనసూయ, రష్మీ దుమ్ము దులిపేస్తున్నారు. హీరోయిన్లకు తాము ఏమీ తక్కువ కాదు అంటూ అదిరిపోయే అందాల ఆరబోతతో అందరి మతులు చెడగొడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది.
నిన్న మొన్నటివరకు సోలోగా ఉన్న టాప్ యాంకర్ రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని దాని సారాంశం. తాను పెళ్లి చేసుకున్న విషయం బయటికి వెళితే కెరీర్ పరంగా డిస్టబెన్స్ వస్తుందని.. చెప్పకుండా మూడు ముళ్ళు వేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్మి ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లకు పైగానే అయింది. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో సందడి చేస్తోంది. అంతకు ముందు కొన్ని సినిమాలు కూడా చేసింది ఈమె.
రష్మి గౌతమ్‌కు యాంకర్‌గా వచ్చిన గుర్తింపు.. నటిగా మాత్రం రాలేదు. బుల్లితెరపై హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు శ్రీమతి అయిపోయిందని తెలుస్తోంది. నిజానికి కొన్నేళ్ల కింద రష్మి ప్రేమ వివాహం చేసుకుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందంటూ ఈ యాంకర్‌పై న్యూస్ వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది.
ఇదే విషయంపై రష్మి గౌతమ్ పలుమార్లు ఖండించింది కూడా. ఆ తర్వాత జబర్దస్త్ షోకు యాంకరింగ్ చేస్తున్నప్పుడు.. అక్కడ ఉన్న సుడిగాలి సుధీర్‌తో ఈమెకు ఎఫైర్ ఉందని ప్రచారం బాగానే జరిగింది. ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏదో ఉంది.. ఏదో నడుస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వండుతూనే ఉంటారు. అయితే అదంతా కేవలం ప్రోగ్రాం రేటింగ్ కోసమే చేశారని.. స్క్రిప్టులో భాగంగానే అవన్నీ ఉంటాయని అందరూ చెప్పేమాట.
వాళ్లతో పాటు నటించే వాళ్లు కూడా ఇదే చెప్తుంటారు. అంతలోనే రష్మికి రహస్యంగా పెళ్లి అయిపోయింది అంటూ ఇప్పుడు మరో వార్త బయటికి వచ్చింది. ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ వచ్చింది. తనకు పెళ్లైందనే విషయం తెలిస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని.. ఆ విషయం దాచేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ భామ.. రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. గతంలో యాంకర్ రవి కూడా తనకు పెళ్లైన విషయాన్ని చాలా కాలం పాటు దాచేసాడు. మరిప్పుడు ఈ యాంకరమ్మ ఎన్నాళ్లు తన పెళ్లి రహస్యంగా ఉంచుతుందో చూడాలి.