జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌తో ఆయన చేసే ట్రాక్స్ అదిరిపోతాయి. ప్రతీ ఎపిసోడ్లో కూడా అనసూయతో కచ్చితంగా డ్యూయెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆది. వీళ్ల కెమిస్ట్రీ కూడా అదిరిపోవడంతో దర్శకులు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్య అయితే స్కిట్స్‌లో కూడా తీసుకొస్తున్నాడు.
జబర్దస్త్‌లో కొత్తగా వచ్చిన ఇమ్మాన్యుయేల్ అదిరిపోయే పంచులు వేస్తున్నాడని.. హైపర్ ఆదిలో మాత్రం జ్యూస్ తగ్గిపోయిందంటూ పచ్చిగానే కామెంట్ చేస్తున్నారు. వీటిపై హైపర్ ఆది మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించడం లేదు. ఎందుకంటే తనపై వచ్చిన విమర్శలను ఎప్పుడూ లైట్ తీసుకుంటాడు ఆది. అలా కెరీర్ మొదట్నుంచి కూడా అలవాటు చేసుకున్నాడు.
చేయడానికి కంటెంట్ లేక.. అనసూయను అడ్డు పెట్టుకుని అలా కానిచ్చేస్తున్నాడు కానీ అసలైన కంటెంట్ మాత్రం చేయడం లేదనే విమర్శలు హైపర్ ఆదిపై వస్తున్నాయి. అయితే బాడీ షేమింగ్ చేస్తాడు లేదంటే అనసూయను స్కిట్లో పెట్టుకుని ఏదో మాయ చేస్తాడంటున్నారు. హైపర్ ఆదిపై ఇలాంటి విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు.. చాలా రోజులుగా ఇదే వార్తలే వినిపిస్తున్నాయి.
మరోవైపు అనసూయతోనే డ్యూయెట్స్ ఉండేలా.. ఆమెపై పంచులు వేసేలా స్కిట్ రాసుకుంటున్నాడు. ఈ మధ్య కొన్ని వారాల పాటు అనసూయకు కాస్త దూరంగా ఉన్నాడు ఆది. ఆమె కాకుండా జబర్దస్త్‌కు కొత్తమ్మాయిలను బాగానే తీసుకొచ్చాడు.. పరిచయం చేసాడు కూడా. అంతెందుకు ఇప్పుడు వర్ష కూడా అప్పుడు ఆది తీసుకొచ్చిన అమ్మాయే. ఈయన స్కిట్ చేసిన తర్వాతే వర్ష బాగా ఫేమస్ అయింది.
ఇదిలా ఉంటే హైపర్ ఆదిపై అనసూయ సీరియస్ అయిందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏ అమ్మాయి రానపుడు మాత్రమే.. తన వైపు హైపర్ ఆది ఏదో ఆప్షన్లా స్కిట్లో వాడుకుంటున్నాడని.. పైగా స్కిట్ పేరుతో పర్సనల్ లైఫ్‌పై కూడా పంచులు వేస్తున్నాడని అనసూయ కాస్త ఫీల్ అయినట్లు సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం.