ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజంగానే సుధీర్‌ను మల్లెమాల పక్కన బెడుతుందేమో అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ జబర్దస్త్ కామెడీ షో. ఈయనకు అదే గుర్తింపు తీసుకొచ్చింది. అంతకుముందు సుధీర్ అంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఓ మెజీషియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ అయ్యాడు సుడిగాలి సుధీర్.
అయితే ఈయన జర్నీలో.. ఎదగడంతో అడుగడుగునా సాయం చేసింది మాత్రం మల్లెమాల ప్రొడక్షన్స్. కేవలం వాళ్ల వల్లే ఈ రోజు సుధీర్ స్టార్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు మల్లెమాల ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు సుధీర్. ఈయన లేకపోతే మల్లెమాల లేదేమో అనే స్థాయికి ఎదిగాడు. సుధీర్ రెమ్యునరేషన్ పెరగడంలో వీళ్ల పాత్ర ఎంతో ఉంది.
అయితే పెట్టాలన్నా.. తిట్టాలన్నా ఇచ్చే వాడికే సాధ్యం అన్నట్లు ఇప్పుడు సుడిగాలి సుధీర్‌ను మల్లెమాల పక్కన పెడుతుందేమో అనే అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షో నుంచి సుధీర్ వెళ్లిపోతున్నాడనే రూమర్స్ ఈ మధ్యే మొదలయ్యాయి. అలాంటిదేం లేదని ఈ మధ్యే ఓ స్కిట్ చేసి క్లారిటీ ఇచ్చారు టీమ్. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఫ్యూచర్లో అది కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
కానీ తొలిసారి ఈ మధ్యే సుధీర్ లేని మల్లెమాల ప్రోమోలు వస్తున్నాయి.. ఈవెంట్స్ షూటింగ్ అవుతున్నాయి.. ఎపిసోడ్స్ బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఢీ 14 నుంచి సుడిగాలి సుధీర్‌తో పాటు రష్మి గౌతమ్‌ను కూడా తప్పించింది మల్లెమాల టీమ్. రెమ్యునరేషన్ విషయంలో తేడాలొచ్చి ఆయన బయటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. హైపర్ ఆదిని అలాగే ఉంచి.. ఆయన జోడీ దీపిక పిల్లిని కూడా పక్కన బెట్టేసింది.