తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్ తో వచ్చిన 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకి బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ రేటింగ్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇక ఇందులో నటించిన క్యారెక్టర్లకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది.
వంటలక్క, డాక్టర్ బాబు బుల్లితెరపై వచ్చిన ఈ క్యారెక్టర్స్ సీరియల్ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాయి. ప్రతి ఇంట్లో ఈ సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ టెలివిజన్ ని రూల్ చేస్తుంది. అన్ని ఛానల్స్ లో, అన్ని షోల కంటే కూడా ఎక్కువగా ఈ సీరియల్ కి రేటింగ్ వచ్చింది. ఐపీఎల్, బిగ్‌బాస్ లాంటివి ఉన్నా ‘కార్తీక దీపం’ సీరియల్ రేటింగ్ తగ్గలేదు.