‘భీష్మ’ వంటి భారీ సక్సెస్ తర్వాత సరైన హిట్టు లేని నితిన్.. ఇపుడు తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో సేమ్ హీరోయిన్ రష్మికతో చేస్తోన్న కొత్త సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్‌ను హీరో నితిన్, రష్మికలపై చిరంజీవి క్లాప్ కొట్టారు. (Twitter/Photo)
నితిన్ విషయానికొస్తే.. ఈయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం(macherla niyojakavargam ). ఈ సినిమాలో కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యం యస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. (Twitter/Photo)
అందులో భాగంగా స్క్రిప్ట్‌పై మరింత శ్రద్ధ వహిస్తున్నారట. ఏలాగైన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనీ అటు నితిన్, వక్కంతం వంశీ కసిగా పనిచేస్తున్నారట.ఇక ఈ సినిమా అలా ఉండగానే నితిన్ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. మరోసారి నితిన్, వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. భీష్మ తర్వాత రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా నితిన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. (Twitter/Photo)