రియల్ లైఫ్ లో మంచి స్నేహితులైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో సినిమాలతో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. బాలయ్య బాబు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆసక్తి రేకెత్తించారు. ఈ ఎపిసోడ్ లో వీరితో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు.