అర్జున్ తో చేస్తున్న సినిమా బాగా రావడం కోసం మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టా. నన్ను నమ్ము అంటూ ఏది కూడా చెప్పనిచ్చే వారు కాదు. ఆ తర్వాత వాళ్ల మేనేజర్ నుంచి అకౌంట్ వివరాలు పంపించారు. రెమ్మ్యూనరేషన్ వెనక్కి పంపించెయ్ అన్నారు. ఆ సినిమా నుంచి బయటకొస్తానని నేనైతే చెప్పలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి. ఇప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను అంటూ విశ్వక్ సేన్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
సీనియర్ హీరో అర్జున్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో అతని కూతురు ఐశ్వర్య సర్జాను హీరోయిన్ గా పెట్టి విశ్వక్ సేన్‌తో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్టుగా వచ్చారు. ఆ తర్వాత షూటింగ్ కూడా మొదలైంది. ఇంతలో సడెన్‌గా అర్జున్- విశ్వక్ సేన్ మధ్య చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.