Vishwak Sen : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. విశ్వక్ సేన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తాజాగా ఈయన హీరోగా ‘దాస్ కా దమ్కీ’ అనే చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. (Twitter/Photo)
ఇండి ఫిల్మ్ ‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. ఆ తర్వాత తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా ‘అంగమలై డైరీస్’ తెలుగు రీమేక్ ‘ఫలక్‌నుమా దాస్’లో నటించి నిర్మించి డైరెక్ట్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. ఈ సినిమాతో (Vishwak Sen) విశ్వక్ సేన్ మాస్కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. (Twitter/Photo)
ఇక ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో వచ్చిన హిట్ సినిమాలో (Vishwak Sen) విశ్వక్ సేన్ నటన అబ్బుర పరుస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా విశ్వక్ సేన్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. (Twitter/Photo)
విశ్వక్ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తున్నారు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌గా అలరించనున్నారు విశ్వక్ సేన్. ఇక విశ్వక్ సేన్ నటించిన గతం చిత్రం పాగల్ ఆ మధ్య విడుదలై అంతగా ఆకట్టుకోలేదు .
ఇక విశ్వక్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే.. తమిళ హిట్ సినిమా ఓ మై కడవులేలో తెలుగు రీమేక్ ఓరి దేవుడాలో విశ్వక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని అంటున్నారు. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. (Twitter/Photo)