యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓరి దేవుడా. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం ధమ్కీ.. ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విష్వక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మాస్, క్లాస్ కలగలిసిన లుక్ లో ఆకట్టుకుంటున్నారు విశ్వక్. Photo : Twitter
ఇక ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Photo : Twitter
ఇక విశ్వక్ లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా విషయానికి వస్తే.. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఆయన భక్తుడిగా విశ్వక్ సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. పీవిపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. Photo : Twitter
తమిళంలో హిట్టైన ‘ఓ మై కడువులే’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్, టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్‌కు జనాలను మాత్రం తీసుకురాలేకపోయింది. ఓరిదేవుడా నవంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ యాప్ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. అక్కడ మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ నటన బాగుంది. Photo : Twitter
ఇక విశ్వక్ సేన్ తాజాగా ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉండగా.. ఈ సినిమా షూటింగ్ రాకపోవడంతో.. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, మరోవైపు విశ్వక్ కూడా కొన్ని మార్పులు చెప్పానని.. అయితే అవి చేయలేదని.. తన వర్షన్ చెప్పడం ఇలా ఆ వివాదం ముగిసింది. Photo : Twitter
ఇక విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం విషయానికి వస్తే.. ఈ సినిమా మే 6న విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అయితే కంటెంట్ బాగున్నా సినిమా అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. థియేటర్ రన్ ముగియడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్.. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో అదరగొట్టారు. Photo : Twitter
ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ ముఖచిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. Photo : Twitter