మెగా ఫ్యామిలీ అన్నా, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక అన్నా బయట అంతో ఇంతో డామినేషన్ ఉంటుంది. బుల్లితెరపైనా నిహారిక తన డామినేషన్ చూపించింది. వెబ్ సిరీస్లు నిర్మిస్తూ సక్సెస్ అయింది. అయితే సినిమాల్లో మాత్రమే నిహారిక ఫెయిల్ అయింది. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. అయితే ఇప్పుడు తనకు కలిసి వచ్చిన వెబ్ సిరీస్ల మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది.
రాధిక (డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి) నీ వల్ల ఈ ప్రోగ్రాం ఇంకో స్థాయికి వెళ్లింది.. హై హీల్స్ వేసుకుని వచ్చావ్ అంటూ విశ్వక్ సేన్ మరింతగా నవ్వులు పూయించాడు. మొత్తానికి విశ్వక్ సేన్ మాత్రం ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం హిట్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసేసిన సంగతి తెలిసిందే.