Vishwak Sen: యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘దాస్ కా దమ్కీ’ ఉగాది కానుకగా విడుదలై సంచలన వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ గత చిత్రాల ఫస్ట్ డే వసూళ్ల విషయానికొస్తే..
దాస్ కా దమ్కీ | తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమా కొత్త తెలుగు సంవత్సరాది రోజున దుమ్ము దులుపింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.06 కోట్ల షేర్ రాబట్టి సంచలనం రేపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.08 కోట్ల షేర్ ( రూ. 8.20 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.మొత్తంగా విశ్వక్ సేన్ కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
విశ్వక్సేన్ విషయానికొస్తే.. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో పరిచమైన ఈ యువ నటుడు .. ఆ తర్వాత ‘ఫలక్నుమా దాస్’ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మూవీ తర్వాత సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్లారు. మద్యలో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాకపోయినా.. ఓవరాల్గా ఓకే అనిపించుకుంది. తాజాగా ‘దాస్ కా దమ్కీ’ మూవీ విశ్వక్ సేన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ‘దాస్ కా దమ్కీ’ అనే మూవీతో విశ్వక్ సేన్ తన మార్కెట్ పరిధి పెంచుకున్నాడనే చెప్పాలి.