Vishwak Sen | Dhamki : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మించారు.. దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మార్చి 22న ఉగాది కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. Photo : Twitter
ఈ చిత్రం మొదటి రోజున అన్ని అంచనాలను మించిపోయింది. ఈ సినిమా అన్ని అంచనాలను అధిగమించి 4cr దగ్గర షేర్ వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాం : 91 లక్షలు, సీడెడ్ : 43 లక్షలు, ఉత్తరాంధ్ర : 40 లక్షలు, ఈస్ట్ : 30 లక్షలు, వెస్ట్ : 20 లక్షలు, గుంటూరు : 40 లక్షలు, కృష్ణ : 25 లక్షలు, నెల్లూరు : 17 లక్షలు వచ్చింది. విశ్వక్ సేన్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. (Photo : Twitter)
ఈ సినిమా నిన్నటితో 10 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా 10 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం మొదటి రోజున అన్ని అంచనాలను మించిపోయింది. ఈ సినిమా అన్ని అంచనాలను అధిగమించి 4cr దగ్గర షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా నిన్నటితో 10 రోజుల పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 10 డేస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. అందులో భాగంగా ఏరియాల వారిగా చూస్తే.. నైజాం : 3.76 కోట్లు , సీడెడ్ : 1.23 కోట్లు.. ఉత్తరాంధ్ర : 1.05 కోట్లు, ఈస్ట్ :రూ. 69 లక్షలు, వెస్ట్ :రూ. 39 లక్షలు, గుంటూరు : రూ. 70 లక్షలు, కృష్ణ :రూ. 59 లక్షలు, నెల్లూరు :రూ. 32 లక్షలు వచ్చింది. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 8.73 కోట్లు (రూ. 16.10 కోట్ల గ్రాస్),.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.18 కోట్లు.. ఓవర్సీస్ రూ. 1.18 కోట్లు.. మొత్తంగా రూ. 11.19 కోట్ల షేర్ (రూ. 21.85 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా విశ్వక్సేన్ కెరీర్లో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. . Photo : Twitter
ఓవరాల్‌గా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలనే తీసుకొచ్చింది. రూ. 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి రూ. 3.19 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్‌గా వర్క్ చేస్తుంటాడు. అయితే తనకు మాత్రం జీవితంలో బాగా ఎదగాలనీ.. మంచి స్థాయిలో ఉండాలనీ ఆశ ఉంటుంది. ఎప్పుడూ అవే కలలు కంటూ ఉంటాడు. ఇక మరోవైపు SR ఫార్మా చైర్మన్‌గా డాక్టర్ సంజయ్ రుద్ర ( రెండో విశ్వక్ సేన్) తన ప్రయోగాలతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పాన్ని కలిగి ఉంటాడు. Photo : Twitter
విశ్వక్ సేన్ నటుడిగా అదరగొట్టాడనే చెప్పోచ్చు. విశ్వక్ ఆటిట్యూడే సినిమాకు ప్లస్. విశ్వక్ సేన్ రెండు షేడ్స్లోను అదరగొట్టాడు. ముఖ్యంగా కంపెనీ చైర్మన్ రోల్ లో అయితే మంచి నటనను ప్రదర్శించాడు. అలాగే ఎమోషన్స్ విషయంలో కూడా ఇరగదీశాడు. అయితే దర్శకుడిగా మాత్రం ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. ఇక హీరోయిన్గా నివేదా పేతురాజ్ తన వరకు అందచందాలతో అదరగొట్టింది. తన గ్లామ్ షోతో మాస్ ఆడియెన్స్ మంచి ట్రీట్ ఉంటుంది. Photo : Twitter
ఈ సినిమాలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. Photo : Twitter
ఇక విశ్వక్ లాస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఆయన భక్తుడిగా విశ్వక్ సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా 2022 అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. పీవిపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. Photo : Twitter