ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్‌గా వర్క్ చేస్తుంటాడు. అయితే తనకు మాత్రం జీవితంలో బాగా ఎదగాలనీ.. మంచి స్థాయిలో ఉండాలనీ ఆశ ఉంటుంది. ఎప్పుడూ అవే కలలు కంటూ ఉంటాడు. ఇక మరోవైపు SR ఫార్మా చైర్మన్‌గా డాక్టర్ సంజయ్ రుద్ర ( రెండో విశ్వక్ సేన్) తన ప్రయోగాలతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పాన్ని కలిగి ఉంటాడు.
విశ్వక్ సేన్ నటుడిగా అదరగొట్టాడనే చెప్పోచ్చు. విశ్వక్ ఆటిట్యూడే సినిమాకు ప్లస్. విశ్వక్ సేన్ రెండు షేడ్స్లోను అదరగొట్టాడు. ముఖ్యంగా కంపెనీ చైర్మన్ రోల్ లో అయితే మంచి నటనను ప్రదర్శించాడు. అలాగే ఎమోషన్స్ విషయంలో కూడా ఇరగదీశాడు. అయితే దర్శకుడిగా మాత్రం ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. ఇక హీరోయిన్గా నివేదా పేతురాజ్ తన వరకు అందచందాలతో అదరగొట్టింది. తన గ్లామ్ షోతో మాస్ ఆడియెన్స్ మంచి ట్రీట్ ఉంటుంది.
ఈ సినిమాలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.