విశ్వక్ సేన్, రుక్సాన్ థిల్లాన్ హీరో, హీరోయిన్స్‌గా నటించిన.. ఈ సినిమా మే 6న విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అయితే కంటెంట్ బాగున్నా సినిమా అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. అది అలా ఉంటే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. దీనికి సంబంధించి ప్రకటన విడుదలైంది. Photo : Twitter
ఈ సినిమాలో విశ్వక్ సేన్.. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో అదరగొట్టారు. మొదటి వీక్ బాగానే కలెక్ట్ చేసిన రెండో వారంలో సర్కారు వారి పాట, డాన్' వంటి చిత్రాలు విడుదలవ్వడంతో డల్ అయ్యింది. దాదాపుగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్‌ను చూస్తే.. నైజాంలో 1.72 కోట్లు, సీడెడ్‌లో 0.48 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.42 కోట్లు, ఈస్ట్‌లో 0.25 కోట్లు, వెస్ట్ 0.21 కోట్లు, గుంటూరు 0.28 కోట్లు, కృష్ణాలో 0.25 కోట్లు, నెల్లూరులో 0.16 కోట్లు. ఇక ఏపీ + తెలంగాణలో మొత్తంగా 3.77 కోట్లు వచ్చింది. Photo : Twitter
రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.22 కోట్లు, ఓవర్సీస్లో 0.48 కోట్లు, ఇక మొత్తం వరల్డ్ వైడ్ టోటల్‌ను చూస్తే.. 4.47 కోట్లు. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 5.96 కోట్లకు జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాలి. థియేట్రికల్ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.4.47 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. దీంతో రూ.1.53 కోట్ల నష్టాలతో ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ మిగిలిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా జూన్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. Photo : Twitter
యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. థియేటర్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని అదరగొడుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్‌గా రిలీజ్ అయ్యింది.. Photo : Twitter
ఇక ఈ సినిమా 8 రోజులు పూర్తయ్యేసరికి రూ.4.31 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.69 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.. అయితే అది కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. అశోక వనంలో అర్జున కళ్యాణం 5.80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా 6.30 కోట్ల రేంజ్లో షేర్ని ఓవరాల్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పెద్ద సినిమాల కారణంగా ఈ సినిమాకు థియేటర్స్ లేకుండా పోయాయి. దీంతో సినిమాలో కంటెంట్ బాగున్నా.. కలెక్షన్స్ లేకుండా పోయాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. . Photo : Twitter
విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న మంచి క్రేజ్ ఉన్న దృష్ట్యా ఈ సినిమాను ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందని తెలుస్తోంది. ఇక ఈసినిమాను బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా చేశారు. ఇక మిడిల్ ఏజ్ కి వచ్చి పెళ్లి కోసం ఎదురు చూసే వ్యక్తి పాత్రలో విశ్వక్ చేసిన నటన బాగుందని అంటున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ తన లుక్స్, డ్రెస్సింగ్ గాని అంతా బాగున్నాయని అంటున్నారు. అంతేకాదు ట్రైలర్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో హీరో చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. Photo : Twitter
ఈ సినిమాతో విశ్వక్ సేన్‌కు మంచి విజయం దక్కేలా ఉందని అంటున్నారు నెటిజన్స్.విశ్వక్ సేన్ ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రను పోషించారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాపినీడు బి, సుధీర్ ఈదరతో పాటు ఎస్విసీసీ డిజిటల్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. జయక్రిష్ సంగీతం అందించారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా చేశారు. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ ముఖచిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్నారు. Photo : Twitter
కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వామిత్ర పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్.. తమిళ సూపర్ హిట్ ప్రేమకథ చిత్రం ఓ మై కడవులే రీమేక్‌లో విశ్వక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అశ్విన్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నట ప్రయాణం విషయానికి వస్తే.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు విశ్వక్. . Photo : Twitter
టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇండి ఫిల్మ్ వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్నామా దాస్‌లో నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. ఈ సినిమాతో విశ్వక్ సేను మాస్కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు.. Photo : Twitter
కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటన అబ్బుర పరుస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా విశ్వక్ సేన్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక విశ్వక్ సేన్ నటించిన పాగల్ ఇటీవల విడుదలై ఓకే అనిపించింది. విశ్వక్ సేన్, (Vishwak Sen Nivetha Pethuraj ) నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పాగల్’ . . Photo : Twitter