విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) ‘విక్రమ్’ అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీష్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు తాజాగా ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. కోటి విలువైన లెక్సస్ సెడాన్ కారును బహుమతిగా ఇచ్చారు. (Twitter/Photo)
లోకేష్ కనగారాజ్ విషయానికొస్తే.. తమిళంలో పాటు తెలుగులో వరుసగా కార్తి ‘ఖైదీ మూవీతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత విజయ్ హీరోగా తెరెక్కించిన ‘మాస్టర్’ మూవీతో కెవ్వు కేక పెట్టించారు. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమాతో హాట్రిక్ సక్సెస్ అందుకొని దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత స్థానం అందుకున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఈయనకు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (Twitter/Photo)
ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్ రోల్లో అదగొట్టేసారు. అంతేకాదు త్వరలో ఆయన హీరోగా నటిస్తోన్న సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రస్తావించారు. . ఈ సినిమాలో కమల్‌హాసన్ మాజీ 'రా' ఏజెంట్‌గా అదరగొట్టారు.(Photo Twitter)
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. విక్రమ్ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.70 కోట్ల గ్రాస్‌ను 1.96 షేర్‌ను సొంతం చేసుకుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటి రోజు విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగారూ. 50. 75 కోట్ల గ్రాస్‌ను అందుకుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. (Vikram Photo : Twitter)
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ. 8 కోట్ల రేంజ్లో జరిగింది. ఆ తర్వాత రూ. కోటి తగ్గించారు. మొత్తంగా 7.50 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా రూ. 40 లక్షలతో లాభాల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. రూ. 188.51 CR గ్రాస్ కలెక్షన్స్.. రూ. 120 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. Kamal Haasan Photo : Twitter