హీరో విక్రమ్.. తమిళంతో పాటు.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. భిన్నమైన సినిమాలు తీసుకొని తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు చియాన్ విక్రమ్. తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ అయ్యింది. శివ పుత్రుడు (Siva Putrudu), అపరిచితుడు (Aparichitudu) వంటి సినిమాలతో తెలుగులో భారీ విజయాలను నమోదు చేసుకున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళు చేసిన కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ)లోరూ. 1.17 కోట్లు., సీడెడ్ (రాయలసీమ)లో రూ. 44 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు.., తూర్పు గోదావరిలో రూ. 36లక్షలు.. పశ్చిమ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణ రూ. 37 లక్షలు.. నెల్లూరు రూ. 19 లక్షలు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 3.88 కోట్ల షేర్ (6.65 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. (File/Photo)
కోబ్రా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 5 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ఇంకా రూ. 1.12 కోట్ల షేర్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. ఓవరాల్గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూాడాలి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. (File/Photo)
తమిళనాడులో ఈ సినిమా రూ. 3070 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలో రూ. 6.65 కోట్లు.. కర్ణాటకలో రూ. 4.05 కోట్లు.. కేరళలో రూ. 2.80 కోట్లు.. రెస్టాఫ్ భారత్ రూ. 1.35 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 5.55 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 51.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింద. షేర్ విషయానికొస్తే.. రూ.26.95 కోట్లు వచ్చింది. మొత్తంగా మిగతా ఏరియాల్లో ఎంత బిజినెస్ చేసింది తెలియాల్సి ఉంది. (Twitter/Photo)